జాతరతో పూనకాలు తెప్పించనున్న ఎన్టీఆర్, బన్నీ
టాలీవుడ్ నుంచి ఈ ఇయర్ రానున్న పాన్ ఇండియా సినిమాల్లో దేవర, పుష్ప2 కు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒక సారూప్యత ఇప్పుడు ఫ్యాన్స్ కు హాట్ టాపిక్ గా మారింది. అది మరేదో కాదు, జాతర ఎపిసోడ్స్. హీరోయిజంను నెక్ట్స్ లెవెల్ లో ఎలివేట్ చేసేలా కొరటాల, సుకుమార్ ఈ ఎపిసోడ్స్ ను తీర్చిదిద్దారని తెలుస్తోంది.
దేవరలో సముద్రం ఒడ్డున ఆయుధ పూజ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ఓ రేంజ్ లో సాంగ్ కోసం డ్యాన్స్ వేయడంతో పాటూ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనిపించేలా ఓ ఫైట్ కూడా ఉంటుందట. ఇప్పటివరకు చూడని విధంగా కొరటాల ఈ ఫైట్ ను మాస్ కు కిక్కెక్కించేలా తీర్చిదిద్దాడట. ఇక పుష్ప2 లో గంగమ్మ జాతర మెయిన్ హైలైట్గా నిలవనుందని ఎప్పట్నుంచో అంటున్నారు.
ఆ జాతరతో పాటూ క్లైమాక్స్ ఫైట్, మరో రెండు సాంగ్స్ ఉంటాయని, పుష్ప1లో లేని చాలా హై మూమెంట్స్ ఈ సినిమాలో చూడొచ్చని యూనిట్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు. 12 నిమిషాలకు పైగా సాగే యాక్షన్ ట్రాక్ కూడా పుష్ప2లో ఉంటుందని ఆ సీక్వెన్స్ మొత్తం ఆడియన్స్ చూపు కూడా తిప్పరని ఎంతో హైప్ ఇస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్, బన్నీ బిగ్ స్క్రీన్ పై చేసే జాతర ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయంలా కనిపిస్తోంది.













