Devara: నెట్‌ఫ్లిక్స్ లో దేవర జాతర

ఎన్టీఆర్(NTR) హీరోగా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో గతేడాది వచ్చిన సినిమా దేవర(Devara). ఈ సినిమాకు ముందు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయింది. లాంగ్ రన్ లో దేవర రూ. 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఓపెనింగ్స్ తోనే రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయ్యాక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్(Netflix) లో రిలీజైన టైమ్ లో పలు రికార్డులు క్రియేట్ చేసిన దేవర సినిమా ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను సాధించింది. తాజా అప్డేట్ ప్రకారం దేవర మూవీ 16.1 మిలియన్ వ్యూస్ తో నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన తెలుగు మూవీస్ లో ఒకటిగా మారిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వల్లే దేవర సినిమా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తుందని తారక్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.
కాగా దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో తండ్రీ కొడుకులుగా కనిపించి తన నటనతో విమర్శకులను సైతం మెప్పించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) విలన్ గా నటించారు. దేవర సినిమా విజయంలో అనిరుధ్(Anirudh) సంగీతం, బీజీఎం కీలక పాత్ర పోషించగా, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.