ఆరో షెడ్యూల్లోనూ దేవర ఫైటింగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమాగా దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా ఉండేట్లు కొరటాల తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పీటర్ హెయిన్స్, కెన్నీ బేట్స్ పని చేస్తున్నారు. కొన్ని నెలలుగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవరలో ఫ్యాన్స్ ఊహకు అందని విధంగా యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 5 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న దేవర షూటింగ్లో ఇప్పటివరకు ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలే తెరకెక్కించారు.
దీంతో దేవర యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తయిందనుకున్నారు. కానీ యూనిట్ ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం దేవర నెక్ట్స్ షెడ్యూల్ లో కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని, తారక్ పై భారీ పోరాట సన్నివేశాలను తర్వాతి షెడ్యూల్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ వేయగా మరో రెండ్రోజుల్లో దేవర ఆరో షెడ్యూల్ మొదలు కానుంది. చూస్తుంటే దేవర సినిమాలో కంటెంట్ కంటే యాక్షన్ పార్టే ఎక్కువున్నట్లు అనిపిస్తుంది.













