దేవర డిజిటల్ రేటుకు మతి పోవాల్సిందే
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర. ఈ సినిమా డిజిటల్ హక్కులను అన్ని భాషలకు కలిపి నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందన్న వార్త టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్సైడ్ సమాచారం ప్రకారం దేవరను రూ.90 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట రాలేదు కానీ ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో దేవరకు భారీ స్కేల్ దక్కింది.
దేవర సెట్స్ ను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెప్తున్న మాటల ప్రకారం, ఈ సినిమా చాలా భారీగా ఉండనుందట. ఓన్లీ ఎన్టీఆర్ ఇంట్రో ఎపిసోడ్ 20 రోజులు షూట్ చేశారంటే దేవర ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.













