Balakrishna: నెగిటివ్ టాక్ తోనూ బాలయ్య రికార్డులు
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా అఖండ2 తాండవం(Akhanda2 Thandavam). గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన అఖండ2(Akhanda2)కు మొదటి నుంచి మంచి అంచనాలుండటంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. కానీ సినిమాలో కంటెంట్ చెప్పుకోదగ్గ రీతిలో లేకపోవడంతో నెగిటివ్ టాక్ కూడా వచ్చింది.
అయితే ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాలయ్య ఈ మూవీతో కూడా రికార్డులు సెట్ చేస్తున్నాడు. అఖండ1(Akhanda1) నుంచి బాలయ్యకు సక్సెస్ లు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్య(Balayya) సినిమాలు యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్లు అందుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అఖండ2 కూడా 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడంతో ఇది సెన్సేషన్ గా మారింది.
దీంతో మొత్తం 5 సినిమాలు వరుసగా 1 మిలియన్ మార్క్ ను అందుకుని నార్త్ అమెరికాలో రికార్డు సృష్టించాయి. అఖండ1, వీరసింహా రెడ్డి(Veera simhareddy), భగవంత్ కేసరి(bhagavanth kesari), డాకు మహారాజ్(Daku Maharaj), అఖండ2 తో వరుసగా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకున్న బాలయ్య గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి(Gauthami putra Satakarni) సినిమాతో కూడా 1 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకున్నారు.






