ఇంత స్లో అయితే కష్టం రోషన్
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ సోలో హీరోగా ఇండస్ట్రీకి వచ్చి మూడేళ్లు దాటింది. 2021లో పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ అవకపోయినా తనకు, శ్రీలీలకు మంచి పేరు, ఆఫర్లు తీసుకొచ్చింది. ఓ పక్క శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తుంటే రోషన్ మాత్రం బాగా స్లో అయిపోయాడు. వైజయంతి బ్యానర్ లో ఇప్పటికే ఛాంపియన్ ని నెలల కిందటే ప్రకటించారు.
ప్రదీప్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ప్రభాస్ కల్కి వల్లనో లేక మరో రీజన్ వల్లనో ప్రొడక్షన్ హౌస్ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. మోహన్ లాల్ మలయాళంలో తీస్తున్న పాన్ ఇండియా మూవీ వృషభలో కూడా కీలక పాత్ర దక్కించుకున్నాడు రోషన్. కానీ ఆ సినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టేట్లుంది.
ఇవి కాకుండా రోషన్ ఇప్పటివరకు అఫీషియల్ గా ఒప్పుకున్న సినిమాలేమీ లేవు. అందం, టాలెంట్ రెండూ ఉన్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో అఖిల్ విషయంలో చూస్తున్నాం. అలాంటి టైమ్ లో రోషన్ స్లో గా ఉంటే సెట్ అవదు. కాబట్టి ఏదొకటి చేసి వీలైనంత త్వరగా ఛాంపియన్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే బెటర్. అలా కాకుండా నిదానమే ప్రధానమన్నట్లు వ్యవహరిస్తే మాత్రం రోషన్ చాలా కోల్పోవాల్సి వస్తుంది.













