డిగ్రీ కాలేజ్ ట్రైలర్ విడుదల
వరుణ్, దివ్యారావు నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం డిగ్రీ కాలేజ్. నరసింహనంది దర్శకుడు. లక్ష్మీ నరసింహ సంస్థ నిర్మించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఇద్దరు డిగ్రీ కాలేజీ విద్యార్థుల మధ్య చిగురించిన ప్రేమ నేపథ్యంలో సాగే కథాంశమిది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందించాం. అబ్బాయి, అమ్మాయి క్లాస్‌రూమ్‌లో, బయట ఎలా ప్రవర్తిస్తారో అనే అంశాలను చూపించాం. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సమస్య ఎదురుకావడంతో రీవైజింగ్ కమిటీకి చిత్రాన్ని పంపించాం. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే కట్ చేశారు. డిసెంబర్ ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.













