డిగ్రీ కాలేజ్ ప్రీ రిలీజ్ వేడుక
శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై వరుణ్, దివ్వరావు జంటగా నరశింహనంది స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డిగ్రీకాలేజ్. ఈ నెల 7న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ వేడుకను ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ఏదో పాయింట్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోందన్నారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో దర్శకుడు నరసింహ నంది, హీరో వరుణ్, హీరోయిన్ దివ్యరావు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, సహనిర్మాత ఆలేటి శ్రీనివాసరావు, తదితరులు ప్రసంగించారు.













