దీపికకు అరుదైన గౌరవం
ఒక దీపిక ఉంటేనే ఆ అందాన్ని చూడటానికి రెండు కళ్లూ సరి పోవడం లేదు. ఇక ఇద్దరు దీపికలంటే ఇంకెన్ని కళ్లు కావాలో అనుకున్నాడట రణ్వీర్ సింగ్. ఎందుకంటే లండన్ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో దీపిక మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం పక్కన నిల్చొని పోజు కొడుతున్న దీపికను చూసి రణ్‌వీర్‌కు మతిపోయింది. నేను ఈ విగ్రహాన్ని ఇంటికి తీసుకుపోవచ్చా అన్నాడట రణ్వీర్. 86 చిత్రీకరణ కోసం లండన్ వస్తావు కదా.. అప్పుడు నేను నీ పక్కన ఉండను. అప్పుడు వచ్చి నా బొమ్మను చూసి ఆనందించు అని సరాదాగా చెప్పిందట దీపిక. 2016లో జరిగిన ఐఫా వేడుకల్లో దీపిక ఆహార్యానికి తగ్గట్టు ఈ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి దీపిక, రణ్‌వీర్‌లు కుటుంబ సభ్యులతో కలసి హాజరయ్యారు.













