పాన్ వరల్డ్ మూవీలో దీపికా పదుకొనే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీ దత్ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా పాన్ వరల్డ్ సినిమాలా తెరకెక్కించున్నారట. దీన్ని బట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునేను తీసుకునే ఆలోచనలో ఫిల్మ్‌మేకర్స్ ఉన్నారని తెలిసింది. కాగా ఆమెతో సంప్రదింపులు మొదలైనట్టు.. ఆమె ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న జాన్ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది.













