రజినీ సరసన దీపికా?
ప్రస్తుతం జైలర్ సినిమాను పూర్తి చేసిన రజినీకాంత్ తన 170వ సినిమాను జై భీమ్ డైరెక్టర్ టి.జె జ్ఞాన్ వేల్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి రావడంతో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని దర్శకనిర్మాతలు యోచిస్తున్నారట.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ అందింది. ఈ సినిమాలో రజినీకి జోడీగా దీపికా పదుకొణే అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సందేశాత్మకంగా ఉండే హీరోయిన్ క్యారెక్టర్ కోసం దీపికా అయితే సరిగ్గా సరిపోతుందని, ఆమె అయితే ఈ పాత్రకు తగ్గ న్యాయం చేయగలదని, ఆమె చేస్తే ఈ పాత్రకు మంచి బలం చేకూరుతుందని భావించి దీపికను లైన్లోకి తెస్తున్నారట.
ఈ వార్తలు నిజమైతే మాత్రం ఈ సినిమాకు దీపిక పెద్ద ప్లస్ కానుంది. రజినీతో ఐశ్వర్యారాయ్ తప్ప ఆ రేంజ్ హీరోయిన్ మరొకరు చేయలేదు. ప్రస్తుతం దీపికా సౌత్ సినిమాలపై కూడా దృష్టి పెట్టి ప్రభాస్ సరసన కల్కి సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటూ బాలీవుడ్ లో జవాన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుంది. మరి ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న దీపికా సూపర్ స్టార్ కోసం డేట్స్ ను అడ్జస్ట్ చేయగలుగుతుందో లేదో చూడాలి.













