Deepika Padukone: అరుదైన ఘనత సాధించిన దీపికా పదుకొణె

ఈ మధ్య ఎక్కడా విన్నా దీపికా పదుకొణె(Deepika padukone) పేరే వినిపిస్తోంది. ఇటీవల లేనిపోని వివాదాల్లో ఇరుక్కున్న దీపికా ఇప్పుడో గొప్ప ఘనత అందుకుంది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026(Hollywood Walk of Fame Star 2026) కు దీపికా ఎంపికైంది. ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటించింది. దీపికాను మోషన్ పిక్చర్స్ కేటగిరీలో ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కాగా ఈ గౌరవం అందుకున్న మొదటి భారతీయ నటి దీపికానే కావడం విశేషం. డెమీ మూర్(demi moor), రాచెల్ మెక్ ఆడమ్స్(rachel mecadems), స్టాన్లీ టక్కీ(stanly tuccy), ఎమిలీ బ్లంట్(emily blunt) లాంటి హాలీవుడ్ నటులతో కలిసి దీపికా ఈ ఘనతను అందుకోవడం చూసి ఆమె అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ అవార్డు కోసం ఛాంబర్ 35 మంది టాలెంటెడ్ సెలబ్రిటీలను ఎంపిక చేయగా అందులో దీపికా కూడా ఒకరు.
2018లో టైమ్స్ మ్యాగజైన్ లో 100మంది ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న దీపికా ఆ తర్వాత 2022 ఫిఫా వరల్డ్ కప్ ను ఆవిష్కరించి ప్రపంచం మొత్తాన్ని ఎట్రాక్ట్ చేసింది. 2023లో ఆస్కార్ అవార్డుల్లో నాటు నాటు(naatu naatu) సాంగ్ ను ఆడియన్స్ కు పరిచయం చేసిన దీపికా ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun)- అట్లీ(atlee) కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటూ కల్కి2(Kalki2)లో కీలక పాత్రలో కనిపించనుంది దీపికా.