ఏదో ఒకరోజు రాహుల్ ప్రధాని అవుతారు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నటి దీపికా పదుకొనే గతంలో చేసిన ప్రశంసలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మాదక ద్రవ్యాల కేసులో పదుకొనే విచారణ ముగిసిన అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. రాహుల్ గాంధీ దేశానికి మంచి ఉదాహరణగా నిలుస్తారు. ఏదో ఓ రోజు కచ్చితంగా ప్రధాని అవుతారు. దేశంలోని యువతతో ఆయన బాగా కనెక్ట్ కాగలుగుతారు. సంప్రదాయంగా ఆలోచిస్తారు. అలాగే భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు అంటూ దీపికా ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. కొన్ని రోజులు క్రితం దీపికా పదుకొనే ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు.













