శ్రీదేవి.. ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్ ఆవిష్కరణ
దివంగత నటి శ్రీదేవి జీవిత చరిత్ర శ్రీదేవి: ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్ అనే పుస్తక రూపంలో రానుంది. ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. శ్రీదేవి చిన్నతనం నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగిన జర్నీ మొత్తాన్ని ఈ పుస్తకంలో పొందుపర్చారు. కాజోల్ ఈ పుస్తకాన్ని ముందుమాట రాయడం విశేషం. ఢిల్లీలోని ఇండియా హాబీటాట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నాయిక దీపికా పడుకోన్, బోనీ కపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీదేవి ఐకానిక్ హీరోయిన్. ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్స్టిట్యూట్. శ్రీదేవి నట జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఈ పుస్తకాన్ని ముందుమాట రాయడం నా అదృష్టం అని కాజల్ వ్యాఖ్యానించారు.













