83 లో దీపికా లుక్ విడుదల
తన కలల కంటే కూడా తన భర్త కలల్ని తనవిగా భావించే స్త్రీలందరికీ ఈ సినిమా అంకితం అంటున్నారు దీపికా పదుకోన్. 1983లో భారత జట్టు తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచిన సంఘటన ఆధారంగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 83. కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. ఆయన భార్య రోమీ పాత్రను దీపికా పదుకోన్ చేశారు. ఆల్రెడీ రణ్వీర్ లుక్‌ని విడుదల చేశారు. రణ్వీర్-దీపికా కలిసి ఉన్న లుక్‌ను విడుదల చేశారు. వివాహం తర్వాత ఈ కపుల్ కలసి నటించిన చిత్రమిది. దేశానికి గర్వకారణంగా నిలిచిన సంఘటనతో తీసిని సినిమాలో చిన్న పాత్ర చేయడం గర్వంగా ఉంది అని పేర్కొన్నారు దీపికా. 83 ఏప్రిల్ 10న విడుదల కానుంది.













