రోమిదేవ్ పాత్ర నాకెంతో నచ్చింది…దీపికా
బాలీవుడ్లో భార్యాభర్తలుగా ఉన్న దీపికా.. రన్వీర్ సింగ్ సినిమాల్లో కూడా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కొన్ని చిత్రాల్లో జంటగా నటించిన దీపికా రన్వీర్ సింగ్. పెళ్లయ్యాక కలిసి 83 అనే చిత్రంలో నటిస్తున్నారు. భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెల్చిన విజయగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో రన్వీర్ సింగ్. ఆయన జీవితంలో కీలక పాత్ర పోషించిన భార్య రోమి దేవ్ పాత్రలో దీపిక కనిపించనున్నారు. 83 చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రోమి దేవ్ పాత్రలో నటించడంపై దీపికా స్పందించింది. గతంలో తన భర్త రన్వీర్ సింగ్ తో అనేక చిత్రాల్లో కలిసి నటించినా ఇది కొత్త అనుభవంగా చెప్పుకుంది. దీపికా మాట్లాడుతూ గోలియోంకా రాసలీలా రామ్లీలా, బాజీరావ్ మస్తానీ ఇలా రన్వీర్తో కలిసి సినిమాలు చేశాను. అయితే 83 సినిమా కొత్తగా అనిపిస్తోంది. ఈ సినిమా నేపథ్యం, పాత్రల అలంకరణ, కథ సాగే కాలం ఇవన్నీ మా ఇద్దరికీ విభిన్నమైన చిత్రంలో నటిస్తున్న అనుభూతి కలిగిస్తున్నాయి. ఇలాంటి గొప్ప కథలో నటించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రీకరణ సమయంలో ఒకరి దగ్గర నుంచి మరొకరం కొత్త విషయాలు నేర్చుకున్నాం. చెప్పింది.













