దీపిక మంగళసూత్రం ధరెంతంటే?
బాలీవుడ్ నటీనటులు రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణెల ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటల లెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కౌంట్‌డౌన్ ఎప్పుడో మొదలైపోయింది కూడా. నవంబర్ 14, 15 తారీఖుల్లో తమ వివాహం జరగనున్నట్లు ఇటీవల వీరిద్దరూ ప్రకటించారు. ఇటలీలోని లేక్‌కోమోలో సింధి, కొంకణి సంప్రదాయాల్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. రిసెప్షన్ మాత్రం ముంబాయిలోని ఓ ప్రముఖ హోటలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వధువు కాబోతున్న దీపిక ఇటీవలే షాపింగ్ చేసిందట. దాదాపు కోటీ రూపాయల విలువచేసే నగలను పెళ్లి సందర్భంగా ఆమె ధరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళసూత్రానికి దాదాపు 20 లక్షలు ఖర్చు చేశారని తాజాగా వినిపిస్తోంది.













