దీపికా కు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. లండన్, న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మ్యూజియం సిబ్బంది తాజాగా దీపిక కొలతలు తీసుకున్నారు. దీని కోసం ఆమె లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ చాలా ఆతృతగా ఉంది. కృతజ్ఞురాలిగా భావిస్తున్నా. కేవలం సినిమాల ద్వారానే కాకుండా మరో రూపంలో అభిమానులకు సంతోషానికి కారణం కావడం చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యూజియ చాలా ప్రత్యేకం. నా మైనపు విగ్రహాన్ని చూసి, అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. లండన్‌లోని మ్యూజియంను నా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఒక్కసారి చూశా అని అన్నారు.













