జేజేమ్మగా దీపిక!
అనుష్క లీడ్రోల్లో సెన్సేషనల్ హిట్‌కొట్టిన అరుంధతి చిత్రం బాలీవుడ్లో రీమేక్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జేజమ్మ పాత్ర ఎవరు పోషిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. నిన్నమొన్నటి వరకు అనుష్కశర్మ, కరీనాకపూర్ల పేర్లు వినిపించాయి. తాజాగా స్క్రీన్‌మీదకు దీపిక పదుకొనె పేరు సైతం వచ్చింది. అయితే జేజమ్మ ఎవరనేది చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకూ సస్పెన్సే. హిట్ ట్రాక్‌తో నడుస్తోన్న దీపికనే ఈ పాత్ర వరించే అవకాశాలు ఎక్కువన్న టాక్ లేకపోలేదు. జేజమ్మగా స్వీటీకి మంచి పేరు రావడంతో ఆమెను మించిన పెర్ఫార్మెన్స్తో దీపిక ఎంత పేరు సాధిస్తుందో చూడాలి.













