Deepika Padukone: కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆ సమస్యతో బాధ పడ్డా: దీపికా పదుకొణె
సెలబ్రిటీలు ఒకప్పుడు తామెలాంటి సమస్యతో ఇబ్బంది పెడుతున్నా బయటకు చెప్పేవారు కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక అందరిలోనూ అవేర్నెస్ పెరిగిపోవడంతో ఏ విషయాన్నైనా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika Padukone) తాను ఒకానొక టైమ్ లో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది.
2014లో కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు దీపిక తెలిపింది. ఓ రోజు బాగా అలసటతో కళ్లు తిరిగి పడిపోయినట్టు చెప్పిన దీపిక మొదట్లో ఆ అలసట స్ట్రెస్ వల్ల అనుకుందట. కానీ స్కానింగ్ చేయించుకున్న తర్వాత తన పరిస్థితి అందరిలా లేదని తనకు అర్థమైపోయిందని తెలిపింది.
ఆ టైమ్ లో ప్రతీ విషయానికీ చాలా భయపడిపోయాదాన్నని, అనవసరమైన విషయాల్లో కూడా విపరీతంగా ఏడ్చానని చెప్పిన దీపిక ఆఖరికి తల్లి సలహా మేరకు థెరపిస్ట్ ను కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నానని, ఆ టైమ్ లో కావాలనే ఎవరికీ విషయాన్ని చెప్పలేదని, దాన్నుంచి బయటపడుతున్న టైమ్ లోనే తాను మానసిక ఆరోగ్యం గురించి అందరికీ చెప్పి, తనకు వచ్చిన సమస్యను అందరితో షేర్ చేసుకున్నట్టు దీపిక వెల్లడించింది. అందులో భాగంగానే దీపిక లివ్ లాఫ్ ఫన్(Live Laugh Fun) పేరుతో ఫౌండేషన్ ను స్టార్ట్ చేసి మానసిక ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పిస్తూ వస్తుంది.













