Kakli2: దీపికాను రీప్లేస్ చేసేదెవరో?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన ఆఖరి సినిమా కల్కి 2898ఏడి(Kalki2898AD). గతేడాది రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్లను అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్లలో ఎన్నో రికార్డులను సృష్టించిన కల్కి సినిమాకు సీక్వెల్ ను మేకర్స్ అప్పట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కల్కి సినిమాలో సుమతి అనే కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) కల్కి2(Kalki2) నుంచి రీసెంట్ గానే తప్పుకున్నట్టు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో దీపికా ప్లేస్ ను ఇప్పుడు ఎవరు రీప్లేస్ చేస్తారనే చర్చ మొదలైంది. అందులో భాగంగానే ఇద్దరు హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వారిలో ఒకరు అనుష్క(Anushka). బాహుబలి(Bahubali) తర్వాత ప్రభాస్ తో కలిసి అనుష్క స్క్రీన్ షేర్ చేసుకుంది లేకపోవడంతో ఈ సినిమాలో దీపికా ప్లేస్ లో స్వీటీ నటిస్తే బావుంటుందని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. స్వీటీతో పాటూ నయనతార(Nayanthara), ఆలియాభట్(Aliabhat), సమంత(Samantha) పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఆఖరికి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.