#NTR 31 లో ఎన్టీఆర్ సరసన దీపికా పదుకొనె?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా #NTR 31 గురించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా దీపిక పదుకొనే నటించనుందట. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ కొట్టేశారు జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీం పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి యావత్ భారతదేశంలోని అన్ని వర్గాల ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఎన్టీఆర్ తదుపరి సినిమాల గురించి ఆరా దీయడం మొదలు పెట్టారు. .ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో #NTR 30 మూవీ చేస్తున్న తారక్.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ పాన్ ఇండియా సినిమాకు కమిటై ఉన్నారు. ఎన్టీఆర్ 31గా ఓ పవర్ ఫుల్ సబ్జెక్టు తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం కేజీఎఫ్: చాప్టర్ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. మరోవైపు ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ కంప్లీట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఫినిష్ అయిన వెంటనే ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ మేరకు ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే దీపికా వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ప్రభాస్ చిత్రంలో నటిస్తుంది. గతంలో ఓ సందర్భంలో ఎన్టీఆర్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది దీపిక. తనకు ఎన్టీఆర్ పర్సనాలిటీ ఇష్టం అని, జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ తనకు బాగా నచ్చుతాయని చెప్పింది. అంతేకాదు ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని కూడా చెప్పేసింది. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ బలమైన కథ రాసుకున్నారని, రోమాలు నిక్కబొడిచే సీన్స్ ఈ సినిమాలో చూడబోతున్నామని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని డిఫరెంట్ మేకోవర్‌తో చూపించనున్నారట.













