నవంబర్ లో రణవీర్, దీపికా పెళ్లి!
బాలీవుడ్ సెలబ్రిటీష్ రణవీర్‌సింగ్, దీపికా పదుకొనే 2016 నుంచి ప్రేమలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ ఎవ్వరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు కూడా. అయినా ఆ విషయాన్ని కూడా ఒక్కరూ వెల్లడించలేదు. వీరి వివాహంపై అప్పుడప్పుడు రూమర్స్ వస్తుంటాయి. తాజా నవంబర్లోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందకంటే త్వరలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ గాయకుడు, గీత రచయిత నిక్‌జొనాస్ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ఇండో వెస్టరన్ వెడ్డింగ్‌కు నవంబర్ 20వ తేదీని నిర్ణయించారు. దీన్ని అధికారికంగా ప్రకటించారు. దీని నిమిత్తం ఇప్పటికే జోద్పూర్ కూడా వెళ్లారు. కానీ అదే తేదీన దీపికా, రణవీర్‌ల వివాహం కూడా నిర్ణయించారట. అందువల్ల ప్రియాంక చోప్రా, నిక్ వారి పెళ్లి తేదీన మార్చుకున్నారని సమాచారం. దీపికా వివాహానికి రెండుమూడు రోజులు ముందుగానే ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. ఇదే నిజమైతే నవంబర్ 20న రణవీర్, దీపికల వివాహం జరగనుంది.













