వైభవంగా దీపిక, రణ్ వీర్ వివాహం
బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి సంప్రదాయంలో అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు రణ్వీర్ సీప్లేన్‌లో మండపానికి వచ్చారట. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందట. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో భాగంగా రణ్వీర్ దీపిక వేలికి ఉంగరం తొడుగుతుండగా ఆమె భావోద్వేగానికి లోనైందని సమాచారం. అనంతరం ఉదయం 9 గంటలకు మొదలైన వివాహం సాయంత్రం 3 గంటలకు ముగిసిందని సమాచారం. వివాహానికి వచ్చే అతిథులు రిస్ట్ బ్యాండ్స్, శుభలేఖతో రావాలని నిబంధనలు విధించారు. పెళ్లి జరిగే లేక్ కోమో వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నేడు సింధి సంప్రదాయాంలో మరోసారి దీప్‌వీర్ వివాహం జరగనున్నది.













