ఆ జాబితాలో ఇండియా నుంచి దీపిక కు స్థానం!
ఇప్పుడు దీపిక పడుకునే హవా నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే పరిగెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల పాపులారిటీని పరిగణనలోకి తీసుకొని ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ వారిలో నుంచి ఒక వందమందితో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తుంది. ఈ విధంగా ఈ ఏడాది టైమ్ మేగజైన్ ప్రచురించిన స్పెషల్ ఎడిషన్లో ఇండియా నుంచి దీపిక స్థానం సంపాదించింది. పద్మావత్ చిత్రంలో ప్రదర్శించిన అభినయానికి అమితాబ్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులతోపాటు ప్రపంచవ్యాప్తంగా గల హిందీ సినిమా ప్రేమికులంతా ఫిదా అయిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఎంపిక చేసే వందమంది అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకోవడంపై దీపిక అభిమానులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













