Deekshith Shetty: ప్యారడైజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్(the paradise). మొదటి సినిమా దసరా(Dasara)తోనే భారీ హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్న శ్రీకాంత్, రెండోసారి నాని హీరోగా సినిమా చేస్తున్నాడు. దసరా తర్వాత నాని- శ్రీకాంత్ కలయికలో వస్తున్న మూవీ కావడంతో ది ప్యారడైజ్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా శ్రీకాంత్ ది ప్యారడైజ్ ను తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ మూవీ గురించి దసరా సినిమాలో కీలక పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి(deekshit Shetty) కీలక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో పాటూ సినిమాపై ఉన్న హైప్ ను ఇంకాస్త పెంచాడు.
తాను రీసెంట్ గా ది ప్యారడైజ్ సెట్స్ కు వెళ్లానని, సినిమా కోసం వేసిన సెట్స్, సెటప్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయని, ఈ మూవీ తెలుగు సినిమాలో గేమ్ ఛేంజర్ అవుతుందని, షూటింగ్ సమయంలో నాని లుక్స్ చూసి తనకు గూస్బంప్స్ వచ్చాయని, ది ప్యారడైజ్ మూవీ దసరా కంటే చాలా భారీగా ఉంటుందని చెప్పాడు. దీక్షిత్ చెప్పిన ఈ మాటలు ప్యారడైజ్ పై అంచనాల్ని మరింత పెంచగా, 2026 మార్చి 26న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.







