‘దాసరి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’ గడువు ఏప్రిల్ 10 వరకు పొడిగింపు!!
దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆశయాలకు కొనసాగింపుగా.. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘దాసరి టాలెంట్ అకాడమీ’ 2019 సంవత్సరానికి గాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రకటించడం తెలిసిందే. మార్చి 30 వరకు దీనికి గడువు విధించారు. అయితే.. ఈ ప్రకటన వెలువడిన తర్వాత తాము షార్ట్ ఫిలిం రూపొందించే పనిలో పడ్డామని, కావున గడువు పెంచాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు అందినందున.. ఏప్రిల్ 10 వరకు ఇందుకు గడువు పొడిగిస్తున్నామని దాసరి టాలెంట్ అకాడెమీ వ్యవస్థాపకులు బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని మాత్రం యధావిధిగా ముందు ప్రకటించిన మే 5నే నిర్వహించనున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు.
ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కు జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజ, జ్యూరీ మెంబర్స్ గా ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, సీనియర్ రైటర్ రాజేంద్రకుమార్ పైడిపాటి వ్యవహరించనున్నారు.
మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో సుమారు 15 నిమిషాల నిడివి లోపు షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాలి. ప్రధమ బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా 50 వేలు, మూడవ బహుమతిగా 25 వేలుతో పాటు..
మొదటి జ్యూరీ అవార్డు 25 వేలు, రెండవ జ్యూరీ 15.000/-, ఉత్తమ దర్శకుడు 20.000/-, ఉత్తమ కథా రచయిత 10.000/-, ఉత్తమ నటుడు 10,000/-, ఉత్తమ నటి 10.000/- చొప్పున నగదు బహుమతులు
‘నీహార్ ఈ సెంటర్’ (niharecenter.com) సౌజన్యంతో అందజేస్తారు. ఏప్రిల్ 10 వరకు షార్ట్ ఫిల్మ్స్ స్వీకరించి, మే 5న బహుమతీ ప్రదాన సభ నిర్వహిస్తారు.
షార్ట్ ఫిలిమ్స్ పంపించాల్సిన మెయిల్ ఐడి:













