దాసరి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నది ఎవరు?
ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అందరి సమష్యలకు పరిష్కరా దిశగా వ్యవహరించిన దాసరి నారాయణ రావు ఇంటికే పెద్ద సమస్య వచ్చి పడింది. దాసరి మరణానంతరం ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవలు అంతా ఇంతా కాదు అవి ఇంకా వివాదాంగానే ఉన్నాయి. దాసరి తన తదనంతరం ఆస్తిపంపకాలు చేయాల్సిందిగా మురళీమోహన్, మోహన్ బాబు, సి. కల్యాణ్‌కి ఆ బాధ్యతనిఅప్పగిస్తూ వీలునామా రాశాడట. అయితే వారు చేసిన ప్రయత్నాలన్నీ ఆ మధ్య బెడిసి కొట్టాయి. మళ్లీ తాజాగా అన్నతముళ్ల వ్యవహారం రచ్చకెక్కింది.
దాసరికి ఇద్దరు కొడుకులు. ఒకరు ప్రభు, మరొకరు దాసరి అరుణ్ కుమార్. వీరిద్దరి మధ్య ఆస్తికి సంబంధించిన గొడవలు ముందు నుంచే ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించేందుకు సినీ పెద్దలు ప్రయత్నించినా అవి వ్యర్థమయ్యాయి. అయితే మరోసారి వీరి వ్యవహారం వివాదాస్పందగా మారింది.
దాసరి అరుణ్ కుమార్ ఈ నెల 24న రాత్రి తన ఇంటి గేటును దూకి లోపలకు ప్రవేశించాడని ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రభు మాట్లాడుతూ.. అరుణ్ ఆ సమయంలో బాగా తాగేసి ఉన్నాడని తనను, తన భార్యను, అత్తామామలను దారుణంగా తిడుతూ, కొట్టాడని చెప్పుకొచ్చాడు. అరుణ్ భార్య కూడా దుర్భాషలాడిందని తెలిపాడు. పోలీసుల ముందు కూడా దాడి చేశాడట.
జూబ్లీ హిల్స్‌లోని దాసరికి పెద్ద ఇల్లుంది. అప్పట్లో దాసరి అందులోనే ఉండేవారు. ఆ ఇల్లు నాదంటే నాదంటూ.. ఇద్దరు కొడుకులూ తగువులాడుకుంటున్నారు. నిజానికి ఆ ఇల్లు ప్రభు కూతురి పేరు మీద ఉంది. ప్రస్తుతం ఆ ఇంటి చుట్టూనే వివాదం నడుస్తోంది.
ఇంట్లోకే దొంగచాటుగా చొరబడి, సీసీ టీవీ కెమెరాకు చిక్కాడు అరుణ్. హైదరాబాద్ శివార్లలో దాసరికి ఓ ఫామ్ హౌస్ ఉందట. అందులో కొన్ని ఎకరాల్ని అరుణ్ అమ్మేశాడని, వాటికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకూ తనకు ఇవ్వలేదని ప్రభు ఆరోపిస్తున్నాడు. దాసరికి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని ఇప్పటికే అరుణ్ అమ్మేశాడని, వాటికి కూడా లెక్కా పత్రాలు తెలియకుండా పోయాయని, ఇప్పుడు ఈ ఇంటిపై పడ్డాడని, తనని చంపుతానని బెదిరించాడని ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.













