ఆ విలన్ను వాడుకోవట్లేదుగా
వేరే భాష నుంచి విలన్స్ ను తీసుకొచ్చి ఇక్కడ భారీ రెమ్యూనరేషన్లు ఇచ్చి మరీ తీసుకోవడం టాలీవుడ్ లో గత కొన్నేళ్లలో బాగా ఎక్కువైంది. ఫాహద్ ఫాజిల్ ను పుష్పలో విలన్ గా నటింపచేయడానికి రీజన్ ఇదే. బీజు జార్జ్ ని కూడా కోరి మరీ ఆదికేశవ కోసం తీసుకొచ్చారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఫలితం లేకుండా పోయింది.
మెథడ్ యాక్టింగ్ మీద మంచి అవగాహన ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడం అభినందించాల్సిన విషయమే. ఈ కోవలోకి వచ్చే షైన్ టామ్ చాకో నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత నాగశౌర్య రంగబలిలో నటించినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.
ఇప్పుడు తాజాగా దేవరలో కూడా షైన్ టామ్ ఉన్నాడు. కాకపోతే విలన్ సైఫ్ దగ్గర ఉండే రౌడీల గ్యాంగ్ పెద్దదవడంతో ఆయన ఆ గుంపులో కలిసిపోయాడు. ఇంటర్వెల్లో దేవర చేతిలో కత్తిపోటుకు గురైన ఆయన మళ్లీ కనిపిస్తాడు. ఈ విధంగా చూసుకుంటే దేవర2లో ఆయన పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండేలా ఉంది. చనిపోయాడనుకున్న షైన్ టామ్ ఎలా బ్రతికాడు, దేవర హత్య వెనుక ఉన్న సీక్రెట్ గురించి చెప్పే టైమ్ లో ఆయన పాత్రకు నిడివి ఎక్కువుండే ఛాన్సుంది. అయితే కథల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులేస్తున్న ఈ విలక్షణ నటుడి చేతిలో దేవర కాకుండా మరే కమిట్మెంట్ లేదు. కాబట్టి ఇలాంటి నటులను వీలైనంత ఎక్కువ వాడుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్లదే.













