దసరా క్లైమాక్స్‌కు గూస్బంప్స్ గ్యారెంటీ
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. ఈ సినిమాను నాని మొదటిసారిగా పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ చేస్తున్నాడు. నానికి జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది. మార్చి 30న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి.
సుకుమార్ శిష్యడు శ్రీకాంత ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీగా నిర్మించారు. నాని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.
ఇదిలా ఉంటే దసరా మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. దసరా క్లైమాక్స్ 17-18 నిమిషాల పాటూ ఉండనుందట. ఈ సీన్‌కు థియేటర్లో ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అని చెప్తున్నారు. క్లైమాక్స తో దసరా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని చిత్ర యూనిట్ చెప్తుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై విపరీతమైన క్రేజ్‌తో పాటూ 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను కూడా సంపాదించుకుంది.
నాని, కీర్తి జంటగా నటించిన ఈ మూవీలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, ఝాన్సీ కీలకపాత్రలు పోషించగా, ఈ సినిమా కోసం నాని తన కెరీర్లో ఎప్పుడూ లేనంతగా కష్టపడుతున్నాడు. మరి మార్చి 30న రిలీజ్ అవుతున్న దసరా నానికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













