వామ్మో.. దసరా హైప్ మామూలుగా లేదుగా..!
తెలుగు సినిమాలకు కేవలం మన దగ్గరే కాదు బయట దేశాల్లో కూడా చాలానే డిమాండ్ ఉంది. అక్కడ కూడా మన సినిమాలు మిలియన్ డాలర్ల వర్షం కురిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్న సినిమాలు కూడా ఎంతో మ్యాజిక్ చేసిన దాఖలాలున్నాయి. ఒకప్పుడు రివ్యూలు, రేటింగ్ లు చూసి
సినిమాలకు వెళ్లే ఓవర్సీస్ ఆడియన్స్ ఇప్పుడు ఏ సినిమా వస్తున్నా సరే రిలీజ్ టైమ్‌లోనే చూసేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా యూఎస్‌లో 1200 లకు పైగా లొకేషన్లలో రిలీజై సూపర్‌హిట్ గా నిలిచింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ భారీ అంచనాలతో 800కు పైగా లొకేషన్లలో రిలీజై, ఘోర పరాజయంగా మిగిలింది.
మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా 630కు పైగా లొకేషన్లలో రిలీజై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇక నేచురల్ స్టార్ నాని వంతు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న దసరా సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాని నటించిన దసరా పాన్ ఇండియన్ ఫిల్మ్ గా తెరకెక్కింది. మొదటిసారి నాని కెరీర్లో ఈ సినిమా యూఎస్‌లో 600కు పైగా లొకేషన్లలో రిలీజ్ కానుంది. మరి ఇంత హైప్ ఉన్న ఈ సినిమా నానికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి కూడా 500 లొకేషన్లలోనే రిలీజ్ అయింది.













