తమిళ హీరో ధనుష్ మరో డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నడా?

డైరెక్ట్ తెలుగు లో సినిమా ఓకె చేసిన తమిళ హీరో ధనుష్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఆసియన్ మూవీస్ కు శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ త్రిభాషా చిత్రం చేయడానికి ధనుష్ ఓకె చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో తెలుగులో మరో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ డైరక్టర్ కాంబినేషన్ లో, తెలుగులో ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోంది. అయితే తెలుగు తమిళంలో మాత్రమేనా, హిందీలో కూడానా అన్నది ఇంకా తెలియాల్సి వుంది. తెలుగులో ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఏది ముందు ప్రారంభం అవుతుంది అన్నది చూడాల్సి వుంది.ఎందుకంటే శేఖర్ కమ్ముల ఇంకా స్టోరీ లైన్ మాత్రమే చెప్పారు. ఇంకా స్క్రిప్ట్ నెరేట్ చేయాల్సి వుంది. కానీ రెండో సినిమాకు యంగ్ డైరక్టర్ పూర్తిగా స్క్రిప్ట్ నెరేట్ చేసి వచ్చారు సెట్ మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది, అందువల్ల ఏది ముందు ప్రారంభం అవుతుందో వేచి చూడాల్సి వుంది.