ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల
సుమన్ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ…
సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.
దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ…
దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.
నటీ నటులు :
సుమన్ రంగనాథన్, ముమైత్ ఖాన్, బెనర్జీ, వెంకట్ సంజీవ్ కుమార్, అరుణ్ బచ్చన్, డిఎస్ రావు, రాక్ లైన్ సుధాకర్ బులెట్ సోము, విఠల్ రంగయన్, జీవ సైమన్, సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్, స్నేహ, రిచర్డ్ శాస్త్రి తదితరులు.
డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి, మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ, లిరిసిస్ట్ : భువనచంద్ర, డి ఓ పి: గిరి బెనకరాజు, కోరియోగ్రఫీ : బాబా భాస్కర్
ఎడిటర్ : బాబు ఏ శ్రీవాత్సవ – ప్రీతి మోహన్, పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు, నిర్మాత: వెంకట్, దర్శకత్వం: కె.టి.నాయక్, బ్యానర్ వెంకట్ మూవీస్













