ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ లుక్ విడుదల
ప్రముఖ అమెరికన్ వ్యోమగామి, చంద్రుడిపై నడిచిన తొలి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితాధారంగా సినిమా రాబోతోంది. దామియెన్ చాజెల్లే దర్శకత్వం వహిస్తున్నారు. దానియెన్ చాజెల్లే, విక్ గాడ్ఫ్రీ, మార్చి బోవెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రయాన్ గోస్లింగ్, క్లయిరే ఫోయి, కైలే చందేలర్, పబ్‌లో తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. దీనికి ఫస్ట్‌మ్యాన్ అనే టైటిన్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నీల్ పాత్రలో రయాన్ గోస్లింగ్ నటిస్తున్నారు. జేమ్స్ ఆర్ హాన్సెస్ రచించిన ఫస్ట్‌మ్యాన్ ది లైఫ్ ఆఫ్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అపోలో 11 మిషన్ నేపథ్యం వరకు 60 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.













