Daaku Maharaj: అదనపు కంటెంట్ తో రానున్న డాకు
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్(Daku Maharaj) మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. బాబీ(Bobby) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్ గా నటించగా శ్రద్ధా శ్రీనాథ్(Sraddha Srinath) కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్(Bobby Deol) డాకు మహారాజ్ లో విలన్ గా కనిపించి మరోసారి మెప్పించాడు.
సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టుకుంది. థియేట్రికల్ రన్ ను ముగించుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే డాకు మహారాజ్ ఓటీటీ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్న బాలయ్య ఫ్యాన్స్ కు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతోందట నెట్ ఫ్లిక్స్.
డాకు మహారాజ్ సినిమా మరికొంత కొత్త కంటెంట్ తో ఓటీటీలోకి రాబోతున్నట్టు సమాచారం. థియేటర్లలో చూడని డాకు మహారాజ్ లోని ఓ సాంగ్ ను డైరెక్ట్ గా ఓటీటీ కంటెంట్ లో రిలీజ్ చేయనున్నారట. ఇప్పుడు డాకు మహారాజ్ 5 నిమిషాల ఎక్స్ట్రా కంటెంట్ ను ఓటీటీలో జోడించనుంది. మరి ఓటీటీలోకి వచ్చాక డాకు ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాడో చూడాలి.













