Daku Maharaj: డాకు మహారాజ్ కొట్టేసేలా ఉన్నాడే!
సంక్రాంతి సినిమాల్లో గేమ్ ఛేంజర్(Game Changer) రిజల్ట్ వచ్చేసింది. ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది చెప్పడానికి ఇంకాస్త టైముంది కానీ ప్రస్తుతానికైతే మిక్డ్స్ టాక్ ఉంది. ఇదిలా ఉంటే జనవరి 12న రిలీజ్ కానున్న డాకు మహారాజ్(Daku Maharaj) పై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ముందు వదిలిన ట్రైలర్ లో బాలయ్య(Balayya) మాస్ ఎలిమెంట్స్ తగ్గాయని కామెంట్స్ వినిపించాయి.
అందుకే ఫ్యాన్స్ కోసం ఇవాళ టీమ్ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ కొన్ని పవర్ఫుల్ షాట్స్ తో బాలయ్య క్యారెక్టర్ ఎంత వయొలెంట్ గా ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు. తమన్(Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాబీ డియోల్(Bobby Deol) విలనిజం, డాకు పాత్రను వర్ణించిన తీరు ఈ ట్రైలర్ లో స్పెషల్ గా ఉన్నాయి. ఇలాంటి సినిమాకు వేకువఝామున షోలు ఉండే ఛాన్స్ లేకపోవడం ఫ్యాన్స్ కు నిరాశనే చెప్పాలి.
అఖండ(Akhanda), వీర సింహారెడ్డి(Veera Simhareddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari) లాంటి మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య- తమన్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) హిట్ తర్వాత బాబీ(Bobby) నుంచి వస్తున్న సినిమా కూడా అవడం వల్ల డాకు మహారాజ్ పై అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు.













