Daku Maharaj: డాకు టార్గెట్ ఎంతంటే..
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్(Daku Maharaj) సినిమా సంక్రాంతి కానుకగా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజవుతోంది. మంచి బిజినెస్ తో డాకు మహారాజ్ బాలయ్య కెరీర్లోనే అతి పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ కు రూ.80.70 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించి బాలయ్య(Balayya) పవర్ ను మరోసారి ప్రూవ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. సంక్రాంతి సీజన్ లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బాలయ్య గత సినిమాల ట్రాక్ పరంగా చూసుకుంటే ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి డాకు మహారాజ్ సినిమాకి రూ.82 కోట్ల షేర్ వస్తే బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా నిలుస్తోంది. మంచి టాక్ వస్తే బాలయ్యకు ఇదేమీ పెద్ద నెంబర్ కాదు. అసలే వరుస హిట్ల మీద మంచి జోష్ తో ఉన్నాడు. మాస్ సినిమా కాబట్టి సీడెడ్, నైజాం ఏరియాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్సుంది.













