సైలెంట్ అయిన రాక్షస రాజు
గతంలో చిత్రం, జయం లాంటి హిట్ సినిమాలను ఇచ్చిన డైరెక్టర్ తేజ గత కొన్ని సినిమాలుగా లైమ్ లైట్ లో లేకపోవడం చూస్తూనే ఉన్నాం. నేనే రాజు నేనే మంత్రి సినిమా తప్పించి అతన్నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులే. సీత సినిమా జనాల సహనాన్ని పరీక్షించగా, అహింస సినిమాను మేం తట్టుకోలేమని జనాలు చూడం మానేశారు.
ఇన్ని ఫ్లాపులు పడినా సరే సురేష్ బాబుకు మాత్రం తేజ మీద ఎంతో నమ్మకముంది. అందుకే తనని నమ్మి రానాతో రాక్షస రాజు చేసే అవకాశమిచ్చాడు. సినిమాను గతేడాదే అనౌన్స్ చేశారు కూడా. కానీ ఇప్పటికీ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లలేదు. దీంతో అసలీ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ఆడియన్స్ లో ఎక్కువైపోయాయి. దానికి కారణాలు లేకపోలేదు.
కొన్నేళ్ల కిందట వెంకీతో ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ తో ఓ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు తేజ. కొన్ని సీన్స్ కూడా తీశాక సినిమా ఆగిపోయింది. తర్వాత గోపీచంద్ తో సినిమా ఫిక్స్ అయింది. కథ కూడా రెడీ అయింది కానీ ఎందుకో సినిమా పట్టాలెక్కక ఆగిపోయింది. ఇవన్నీ కాదని చిత్రం2 తన కొడుకుతోనే చేద్దామనుకున్న తేజ, బిజినెస్ జరగదనే కారణంతో డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు రాక్షస రాజుకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఎన్నో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. రానా రాక్షస రాజు కోసం తేజ మంచి డెప్త్ ఉన్న కథ రాసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. షూటింగ్ లేటయినా సరే సినిమాకు సంబంధించిన ఏదొక అప్డేట్ ఇస్తూ ఉంటే సినిమా గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పటికైనా రాక్షస రాజు టీమ్ ఈ విషయంలో స్పందింస్తుందేమో చూడాలి.













