Daggubati Family: ఆస్తుల కంటే బంధమే ముఖ్యం
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) వివాహం సినీ తార శోభితా ధూళిపాళ్ల(Sobhitha Dhulipalla)తో డిసెంబర్ 4న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటూ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) లో చాలా సింపుల్ గా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మెల్లిగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
అందులో ముఖ్యంగా చైతన్య మేనమామలు, తన తల్లికి స్వయానా సోదరులైన దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Suresh Babu), వెంకటేష్(Venkatesh) లు ఈ పెళ్లిలో చాలా హడావిడి చేశారు. పెళ్లికి ముందు మేనమామలుగా సురేష్ బాబు, వెంకటేష్ చైతూని పెళ్లి కొడుకుని చేసి ఆ వేడుకలో ఎంతో సందడి చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను రానా(Rana) భార్య మిహిక(Miheeka) తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలో దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఒకటే దగ్గర ఎంతో సంతోషంగా కనిపించింది. వారిలో ప్రతీ ఒక్కరికీ విడివిడిగా కోట్లలో ఆస్తులన్నా కుటుంబమంటే అంతా కలిస్తేనే అన్నట్టుగా ఈ ఫోటోలో ఎంతో చూడముచ్చటగా కనిపించారు. ఇక వెంకటేష్ కు నాగ చైతన్య అంటే ఎంత ఇష్టమో సందర్భమొచ్చినప్పుడల్లా వ్యక్తపరుస్తూనే ఉంటాడు. చైతూ(Chaithu), వెంకీ కలిసి వెంకీ మామ(Venky Mama) అనే సినిమా కూడా చేశారు.













