రానా మిహిక పెళ్ళికి రాలేక పోయినవారికి దగ్గుబాటి వారి కల్యాణ బహుమతి
రానా దగ్గుబాటి మిహికా బజాజ్ పెళ్లి కుటుంబసభ్యులు, ఆగష్టు 8న అతితక్కువమంది అతిథుల మధ్య చాలా సింపుల్‌గా జరిగిపోయింది. అయితే ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ పెళ్లికి రాలేకపోయిన టాలీవుడ్లో ఇటీవలే పలువురు ఇంట అనేక శుభాకార్యాలు జరిగాయి. కొందర హీరోలు కూడా పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. నితీన్, నిఖిల్, రానా తాజాగా ఓ ఇంటి వారయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. మెగా ఇంట కూడా పెళ్లి సందడి నెలకొంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే కరోనా కారణంగా ఈ పెళ్లిళ్లు, శుభకార్యాలన్నీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా జరిగాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో అతి తక్కువ మంది అతిథులు, కుటుంబసభ్యుల సమక్షంలో వేడుకలు చేసుకున్నారు. రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ల వివాహం హైదరాబాద్ లోనే జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటించి మరిపెళ్లి జరిపించారు. హైదరాబాద్ లో పలువురు కీలక బంధువులు మరియు సినీ పెద్దలు సమక్షంలో వీరి వివాహం చాలా సింపుల్ నిర్వహించారు ఇరు కుటుంబాల పెద్దలు.అయితే ఈ వివాహానికి కరోనా కరాణంగా చాలామంది రాలేకపోయారు. చాలామంది ప్రముఖుల్ని దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఆహ్వానించలేకపోయింది.
అయితే పెళ్లికి రాని వారి కోసం దగ్గుబాటి ఫ్యామిలీ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసింది. పెళ్లికి పిలవలేక పోయిన వారి కోసం ప్రత్యేకంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఓ గిఫ్ట్ తయారు చేసింది. మా పెద్ద కుమారుడి వివాహానికి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయాం. మీ ఆశీర్వాదాలు వారికి కావాలంటూ ఓ లేఖతో పాటు గిఫ్ట్ ఉన్న కిట్‌ని బహుమానంగా అందించారు రానా తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. ఈ గిఫ్ట్‌ను కొంత మంది ప్రముఖ సినీ పెద్దలకు ప్రత్యేకంగా తయారు చేయించి పంపారు.గిఫ్ట్‌తో పాటు స్పెషల్ నోట్ తో రానా మరియు మిహికాల యువ జంటను ఆశీర్వదించామని దగ్గుబాటి సురేష్ బాబు , ఆయన సతీమణి లక్ష్మి కోరారు. ఇప్పుడు రానా పెళ్లి గిఫ్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్‌గా మారింది. లాక్డౌన్ టైంలో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన దగ్గుబాటి రానా, మిహికా మెడలో మూడు ముళ్ళు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహానికి రాని వారు ఇంట్లోనే ఉండి వర్చువల్ రియాల్టీలో వివాహ వేడుకని వీక్షించారు.













