ఏ హీరో తమ్ముడు హిట్ అందుకుంటాడు?
వచ్చే శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింసతో పాటు, బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన నేను స్టూడెంట్ సర్ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ ఇద్దరిలో ఒకరు రానా తమ్ముడు కాగా, మరొకరు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు.
ఈ హీరోల తమ్ముళ్లిద్దరూ ఒకే రోజు డిఫరెంట్ మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. అభిరామ్ అహింస తో పాటు నేను స్టూడెంట్ సర్ కూడా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 2న రిలీజ్ కాబోతుంది.
సరైన టైమ్ చూసుకుని ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అసలే ఆ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. దీంతో యంగ్ హీరోలకు ఇది మంచి డేట్ అనుకోవచ్చు. కంటెంట్‌తో అలరించి, పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సెలవు రోజు కనుక నైజాంలో మ్యాట్నీ నుంచే కలెక్షన్స్ పెరిగే ఛాన్సుంది.













