Dadhak2: యానిమల్ బ్యూటీ సినిమాకు లేనిపోని చిక్కులు
జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా పరిచయమైన దఢక్(Dadhak) మూవీకి సీక్వెల్ గా దఢక్2(Dadhak2) రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రిప్తి డిమ్రి(Tripthi Dimri), సిద్దార్థ్ చతుర్వేది(Siddharth Chathurvedi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఓ విషయంలో ఇబ్బంది వెంటాడుతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది. మనోభావాలు చాలా సెన్సిటివ్ గా మారిన తరుణంలో ఏదైనా సున్నితమైన అంశం మీద సినిమాలు తీసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే లేని పోని తలనొప్పులు తప్పవు.
ముందు చెప్పిన ప్రకారమైతే దఢక్2 మార్చి 7న రిలీజ్ కావాలి. అంటే రిలీజ్ కు ఇంకో పది రోజులే ఉంది. అయినా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం దఢక్2 మరో వారం పోస్ట్ పోన్ అయి, మార్చి 14న రిలీజ్ కానుందంటున్నారు. కానీ దాన్ని కూడా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించలేదు.
అయితే ఈ మూవీ పోస్ట్‌పోన్ అవడానికి కారణం సెన్సార్ బోర్డు చెప్తున్న అభ్యంతరాలేనని తెలుస్తోంది. తమిళంలో వచ్చిన పరియేరుమ్ పెరుమాళ్(Pariyerum perumal) కి రీమేక్ గా దఢక్2 తెరకెక్కుతుందని ఎప్పటినుంచో అంటున్నారు. వెనుకబడిన, షెడ్యూల్ కులాల మీద తీసిన సినిమాగా ఆ సినిమాకు అప్పట్లోనే మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు దాన్నే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తీశారంటున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు పలు కులాల మధ్య గొడవలు రాజేసేలా ఉన్నాయని, అందుకే ఈ మూవీకి ఎలాంటి కట్స్ ఇవ్వాలనే దానిపై సెన్సార్ సభ్యులు చర్చిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.













