సెప్టెంబర్ 20న దాదాసాహెబ్ ఫాల్కే వేడుక
భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ కృషి ఎంతో ఉంద న్నారు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సీఈవో అభిషేక్ విశ్రా. దాదాసాహెబ్ ఫాల్కే దక్షిణాది పురస్కారాలు-2019 వేడుకని హైదరాబాద్లో నిర్వహించనున్నారు. వచ్చే నెల 20న జరిగే ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే మనవడు సి.ఎస్.పుస్కాలర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అభిషేక్ తెలిపారు. ఈ వేడుకల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పురస్కార వేడుకకి దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినీ ప్రముఖులు హాజరవుతారు. 15 విభాగాల్లో పురస్కారాలు అందిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్రావ్, వినయ్, యశ్, రాకేష్, పవన్, సిమ్రాన్ ఆహూజా తదితరులు పాల్గొన్నారు.













