Dacoit: డెకాయిట్ వచ్చేదప్పుడేనా?

అడివి శేష్(Adivi Sesh) నుంచి సినిమా వచ్చి చాలా కాలమవుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి గూఢచారి(Goodachari) సినిమాకు సీక్వెల్ గా జీ2(G2) కాగా, మరొకటి డెకాయిట్(Dacoit). ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ముందుగా మొదలైంది జీ2 కావడంతో ఇదే ముందు రిలీజవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు జీ2 కంటే ముందు డెకాయిట్ మూవీనే రిలీజవుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో(shaniel deo) డైరెక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న సినిమా డెకాయిట్. శేష్ నటించిన క్షణం(Kshanam), గూఢచారి(Goodacharo) సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన షానియల్ డియో డైరెక్టర్ గా ఈ డెకాయిట్ రూపొందుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ వార్త వినిపిస్తోంది.
డెకాయిట్ సినిమా 2025 డిసెంబర్ లో రిలీజ్ కానుందని ట్రేడ్ వర్గాల్లో టాక్. ఈ రిలీజ్ డేట్ పై మేకర్స్ అతి త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) యాక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. భీమ్స్ సిసిరోలియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda), సునీల్ నారంగ్(Suneel Narang) నిర్మిస్తున్నారు.