Daaku Maharaj: అదిరిపోయే టీఆర్పీతో డాకు మహారాజ్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం పుల్ ఫామ్ లో ఉన్నారు. హీరోగా, హోస్ట్ గా, పొలిటీషియన్ గా పలు రంగాల్లో సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ2(Akhanda2) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలయ్య(Balayya) నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా డాకు మహారాజ్(Daaku Maharaj). బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్(Sraddha Srinath) కీలక పాత్రలో నటించింది. బాలయ్య కెరీర్లో మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. సిల్వర్ స్క్రీన్స్ పై అందరినీ అలరించి డాకు మహారాజ్ కు బుల్లితెరపై కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
డాకు మహారాజ్ సినిమాకు 8.23 రేటింగ్ వచ్చినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలతో కంపేర్ చేసి చూసినా డాకు మహారాజ్ కు బుల్లి తెరపై సాలిడ్ రెస్పాన్స్ వచ్చినట్టే లెక్క. బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో నాగవంశీ(Naga Vamsi) ఈ సినిమాను నిర్మించాడు.







