గేమ్ ఛేంజర్ గురించి మరో లీకు
ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో అందరూ ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడో మూడేళ్ల కిందటే మొదలైనా ఇప్పటికీ షూటింగ్ ను పూర్తి చేసుకోలేదు. గేమ్ ఛేంజర్ ఈ ఏడాది ఆఖరిలో రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజై ఓ మోస్తరుగా మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా లీకులొచ్చాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలాంటి సిట్యుయేషన్స్ లో ముఖ్యమంత్రి అయ్యాడు? ఆ తర్వాత ప్రత్యర్థులతో ఎలాంటి ఫైట్ చేశాడన్నది తెరపైనే చూడాలని ఇప్పటివరకు లీకులు రాగా, తాజాగా గేమ్ ఛేంజర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ లీక్ నెట్టింట ప్రచారమవుతుంది.
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉండనుందని, అందులో చరణ్ తండ్రి పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఈ పాత్ర సైకిల్ పై అసెంబ్లీకి, సీఎం ఛాంబర్ కి వెళ్తుందట. సినిమా మొత్తం మీద ఈ సైకిల్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని, సైకిల్ సీన్స్ కాబట్టి తెలుగు దేశం పార్టీ వాళ్లు కూడా సినిమాను ఓన్ చేసుకునే ఛాన్సుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.













