మనమే.. ప్రతి రోజూ ముఖ్యమే
శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మనమే సినిమా జూన్ 7న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ఒక ఇమేజ్ ఉన్న హీరో సినిమాను కేవలం రెండు వారాల ముందు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం ఈ మధ్య కాలంలో బహుశా ఇదే మొదటిసారి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. మంచి రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఇన్నాళ్లు వెయిట్ చేశారు. మొన్నటివరకు ఈ సినిమా జూన్ 14న రిలీజ్ అవుతుందని టాక్ వినిపించింది. కానీ ఇప్పటికే ఆ డేట్ లో మరో రెండు సినిమాలు రిలీజవుతుండటంతో జూన్ 7ని ఫిక్స్ చేశారు మేకర్స్. మనమే టీమ్ చేతిలో ఉంది కేవలం రెండు వారాలు మాత్రమే.
ఇప్పటినుంచి ప్రతి రోజూ మనమే టీమ్ కు ముఖ్యమే. అసలే జూన్ 3 నుంచి 5 వరకు ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ తాలూకు హడావిడి ఉంటుంది. కాబట్టి ఆ టైమ్ లో సినిమాల గురించి ఎవరూ పట్టించుకోరు. కాబట్టి టీమ్ చేతిలో ఉన్న టైమ్ చాలా తక్కువ. ఈ లోగా సినిమాకు మంచి బజ్ వచ్చేలా ప్రమోషన్స్ చేయాలి. ఈ సినిమా విజయం కృతి శెట్టికి ఎంతో కీలకం. శ్రీరామ్ ఆదిత్య కూడా ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతో పరితపిస్తున్నాడు. పెద్ద హీరోల దృష్టికి శ్రీరామ్ వెళ్లాలంటే ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలి. చైల్డ్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రానుంది.













