Suriya46: సూర్య46 కోసం క్రేజీ టైటిల్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వెంకీ అట్లూరి(Venky Atluri) కూడా ఒకరు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమా చేసి ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు వెంకీ అట్లూరి. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ మరో స్టార్ హీరోను లైన్ లో పెట్టి సినిమా చేస్తున్నాడు. అతనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya). ఆల్రెడీ ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది.
సూర్య కెరీర్లో ఈ సినిమా 46(suriya46)వ చిత్రంగా రూపొందుతుండగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. సూర్య46 కోసం వెంకీ అట్లూరి ఓ క్రేజీ టైటిల్ ను పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్(Viswanadhan And sons) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫైనల్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట.
ఈ టైటిల్ అయితే కథకు పర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించి దీన్నే పెట్టాలని చూస్తున్నారట. కాగా ఈ టైటిల్ అటు నెటిజన్స్ తో పాటూ ఇటు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. మమిత బైజు(mamitha byju) హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(GV prakash kumar) సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ లో నాగవంశీ(Naga Vamsi) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.