NTR31పై క్రేజీ అప్డేట్
సలార్2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. NTR31 వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ చేసిన ఈ సినిమా మైథలాజికల్ టచ్ తో యాక్సన్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. సలార్2 ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేశాక, వెంటనే NTR31 స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడట ప్రశాంత్ నీల్.
వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ లాగానే NTR31ని కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ ఐడియా రెడీగా ఉందని కచ్ఛితంగా ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి రెడీ అవుతున్నారట. పుష్ప2 కంటే ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు పెట్టనున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాలతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే రిలీజ్ కానుంది. ఆ తర్వాత వార్2 చేయనున్నాడు. అది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు.













