#PSPK28 క్రేజీ అప్డేట్..
హీరో, డైరక్టర్ కాంబినేషన్స్ కొన్నింటికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో కూడా ఒకటి. వీరి కాంబో లో వచ్చింది ఒక సినిమానే అయినా దాని ఇంపాక్ట్ తొమ్మిదేళ్లయినా కూడా ఇంకా అలానే ఉంది. 2012 లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవడమే కాదు, అప్పట్లో పవన్ కు కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
అందుకే ఈ కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్, హరీష్ కలిసి పీఎస్ పీకే 28 చిత్రాన్ని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఈ సినిమా కోసం స్పెషల్ ఫోటోషూట్స్ కూడా చేసినట్లు న్యూస్ అందుతుంది.
హీరో లుక్ పట్ల స్పెషల్ కేర్ తీసుకునే హరీష్, గబ్బర్ సింగ్ మాదిరేర ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ ను స్టైలిష్ గా చూపించనున్నాడని తెలుస్తుంది. విభిన్నమైన కాన్సెప్ట్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసిన హరీష్, ఈ చిత్రానికి సంచారి అనే టైటిల్ ను అనుకున్నంటున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. ఈసారి ఎంటర్ టైన్మెంట్ తో పాటుగా సోషల్ మెసేజ్ కూడా హరీష్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దేవీ శ్రీ సంగీతమందించనున్న సినిమా ఈ ఇయర్ సెకండాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లనుందంటున్నారు.













